Subscribe

తాటి దూలంలో సూది

By: - Category: పరమానందయ్య శిష్యుల కథలు

ఓకసారి పరమానందయ్యగారికి సూది అవసరమొచ్చింది.  ఆయన శిష్యులను పిలిచి సూది తీసురమ్మని చెప్పారు. శిష్యులంతా బజారుకి సూదికోసం బయలుదేరారు. సూది కొన్నాక వాళ్ళకు ఒక అనుమానం కలిగింది.
“ఈ సూదిని ఎవరు తీసుకెళ్ళి గురువుగారికివ్వాలి?” అందరూ “నేను.”….”.నేను” .. అంటూ పోటి పడ్డారు.

ఆ గొడవ తేలేలా కనిపించలేదు ఇలా ఉండగా, ఓ శిష్యుడికి కొంత దూరంలో ఒక తాటిదూలం ఒకటి కనిపించింది . అతనికి ఓఆలోచన వచ్చిది.

అప్పుడు అతను మిగతావారితో ఇలా చెప్పాడు.. “మనం గొడవ పడొద్దు. అక్కడ ఉన్న తాటిదూలానికి సూదిని గుచ్చి అందరమూ దాన్ని మోసుకెళ్దాం. అపుడు గురువుగారి ఆజ్ఞను  అందరూ సమంగా పాటించినట్లవుతుంది.

ఈ ఆలోచన మిగతా శిష్యులకు కూడా నచ్చింది. వాళ్ళు “సరె” అన్నారు.

ఆ దూలం తీసుకొని దానికి సూది గుచ్చి,  పన్నెండుమంది  శిష్యులు మోసుకువెళ్ళారు. ప్రజలంతా వారి తెలివితక్కువ తనానికి ఎంతగానో నవ్వుకొన్నారు. మొత్తానికి శిష్యులంతా కలిసి ఆ తాటిదూలాన్ని గురువుగారి దగ్గరకు తీసుకువెళ్ళారు.

గురువుగారు ఆశ్చర్యంతో ఏమి జరిగింది అని అడిగారు. శిష్యులు జరిగినదంతా చెప్పారు. అది విని “సూదికోసం తాటి మాను మోసుకొస్తారా!  ఇంతకీ సూదేదీ?” అని అడిగారు
అందరూ తాటిమానులోని సూది వెతికారు.  ఎంత వెదికినా దొరకలేదు. చివరికి గురువుగారు వెదికినా   దొరకలేదు. “మీరు చేసిన హడావిడికి ఆ సూది కాస్తా ఎక్కడో జారిపోయి ఉంటుంది. ముందు ఈ మాను తీసుకెళ్ళి దాని యజమానికిచ్చిరండి” అని నిరుత్సాహపడ్డారు ఆ గురువుగారు.

-మౌనిచింటు

స్నేహం

By: admin Category: బాలలు వ్రాసిన కధలు

స్నేహం

రచన ;  వైష్ణవి

బన్నీ, సిద్ధూ, అభి, నందు  నలుగురు  స్నేహితులు. వాళ్ళు నలుగురు  ఒకే బడి  లో చదువుకునేవారు. ఒకసారి  సిద్ధూ బడికి    రాలేదు  ఆ రోజు అనుకోకుండా  స్కూలు కి మూడురోజులు  సెలవులు  ఇచ్చారు.   బుధవారం, గురువారం, శుక్రవారం  సెలవులు .

శుక్రవారం  సిద్ధూ  పుట్టినరోజు  వుంది. సిద్దు  తన స్నేfriends హితులను  పిలుచుకొని రావటానికి  వెళతాను  అన్నాడు.
సిద్ధూ వాళ్ళ నాన్నగారు  డ్రైవర్ తో  సిద్ధూ  స్నేహితుల  అడ్రెస్ చెప్పి పంపించాడు. బన్నీ వాళ్ళ ఇల్లు  సిద్ధూ ఇంటికి  చాలా  దగ్గరే కాబట్టి  మొదట బన్నీ ఇంటికి వెళ్ళారు.  సాయంత్రం పుట్టిన రోజుకి రమ్మని చెప్పారు.  అభి, నందు వాళ్ళ  దగ్గరకి  వెళుతున్నామని  చెప్పగానే  బన్నీ  కుడా వాళ్ళతో కలిసి  బయల్దేరాడు.
అభి, నందు వాళ్ళు వుండే  అపార్ట్ మెంట్  కొంచెం దూరం.  వీళ్ళు వెళ్ళేసరికి  అభి బయట ఆడుకుంటూ  కనిపించాడు. బన్నీ, సిద్ధూ  అభి వద్దకెళ్ళి  పుట్టిన రోజు గురించి చెప్పి, ఐదవ  అంతస్తు లోని  నందు ఇంటికి  వెళ్లాలని  అందరు  లిఫ్ట్  వద్దకు  వెళ్ళారు. అక్కడ వాచ్ మెన్  వీళ్ళను  చూసి  ఎవరింటికి వెళ్ళాలి  అని  అడిగాడు. సిద్ధూ చెప్పిన  నంబర్ విని  వాళ్ళు ఇప్పుడే  బయటకు  వెళ్లిపోయారు,  అని చెప్పాడు వాచ్ మెన్.
తరువాత అందరు  అభి ఇంటికి వెళ్ళారు.  అభి వాళ్ళ అమ్మ  అభిని ఇప్పుడే మీతో పాటు తీసుకు వెళ్ళండి  వాళ్ళ నాన్న రావాలంటే  చాలా  ఆలస్యం అవుతుంది అంది.  అభి ముస్తాబు అయి సిద్ధూ  బన్నీ తో కలిసి  వెళ్ళాడు.

నందు వాళ్ళ అమ్మ, నాన్న  బయటకు పోయారు కాని నందు ఇంట్లోనే వున్నాడు. వాళ్ళు వచ్చాక  నందు  ఆడుకోవటానికి  అభి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అభి వాళ్ళ అమ్మ  అభి  సిద్ధూ పుట్టినరోజుకి వెళ్ళాడని  చెప్పింది. అప్పుడు  నందు కి చాలా ఏడుపు వచ్చింది.  నన్ను  పిలవకుండా  అందరు పుట్టినరోజు  చేసుకున్నారు  వీళ్ళు నా స్నేహితులు కాదు అని అనుకున్నాడు.  సిద్ధూ పై కోపం వచ్చింది. ఇంకముందు  ఎప్పుడు  సిద్ధు తో మాట్లాడను  అనుకున్నాడు.

మర్నాడు  బడికి వెళ్ళగానే  సిద్ధూ  నందు దగ్గరకి వెళ్లి  చాక్లెట్స్, బొమ్మలు  ఇచ్చాడు.  నందు మాట్లాడకుండా  వున్నాడు   అప్పుడు  సిద్ధు   సారీ  చెప్పాడు.

నువ్వు ఇంట్లో  లేవని వాచ్ మెన్ చేప్పినందువల్ల  ఇది జరిగింది.  నువ్వు లేకపోతె  మాకు కూడా  బాగాలేదు  అన్నాడు.  అప్పుడు నందు జరిగింది  తెలుసుకున్నాడు.  తిరిగి నలుగురు  స్నేహంగా వున్నారు.

Vaishnavi, 8th class, Tirupati.

పక్షుల పలుకులు

By: admin Category: పాటలు

పక్షుల పలుకులు ; రచన ; అనీల్ కుమార్ పిదూరి

Parrot

“మాటలు అంటే

మానవులకు మాత్రమె

సొంతం”అంటే ఎట్లాగ?

మైనా పిట్టల Hummingbird
ఈల పాటలను,

రామ చిలుకల

మిమిక్రీలను,

పికిలి పిట్టల

కువ కువ గానాలు

వింటూ ఆనందించండి!

విని అచ్చెరువులు పొందండి!

Hummingbird

ఏటికి శాపనార్థాలు

By: - Category: పరమానందయ్య శిష్యుల కథలు

పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపినవలసి వచ్చింది.  దానికి కొంత డబ్బు అవసరమయింది. అందుకని చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి ధన, కనక, వస్తు వాహనాలు విరాళాలు సేకరించుకురావాలని శిష్యులను వెంటబెట్టుకుని  బయలుదేరారు.
నాలుగయిదు గ్రామాలు తిరిగేసరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి. అప్పటికే సాయంత్రమయిపోయింది.  తొందరగా చేరకపోతే చీకటి పడిపోతుందని వాళ్ళంతా గబగబా నడవసాగారు.

దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది. ఆ ఏరు మోకాలిలోతు మాత్రమే ప్రవహిస్తుంది.  అది చూసిన శిష్యుడికి బాగా కోపమొచ్చింది.  “మా గురువుగారితో కలసి శిష్యులం వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దుర్భుద్దేమిటి ఈ ఏరుకి? దీనికి గురువుగారన్నా భయం లేదు, అనుకుని “గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకొండి, ఈ నది పొగరు మేము చూసుకుంటాం” అంటూ గురువుగారికి విశ్రాంతి నిచ్చారు.

శిష్యులంతా బాగా అలోచించి.. ఏరుకి ‘చురుకెయ్యడానికి ‘ నిర్ణయించున్నారు. ఒకడు కాగడా తయారు చేసి మంట అంటించాడు.  ఆ కాగడాను శబ్ధం చేయకుండా ఏటిలోకి వెళ్ళాడు.  ఆ  కాగడాని ఏరులో ముంచాడు.  వెంటనే అది చుయ్మని శబ్ధం చేసింది. దానికి, ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకొంటూ వచ్చి పడ్డాడు.

ఈ గోలకి గురువుగారికి మెలకువ రాలేదు.  ఆయనకు గాఢనిద్ర పట్టేసింది.  అది చూసిన మిగతా శిష్యులు , “ఏమయిందిరా?” అని అడిగారు.

“ఏరు పడుకోలేదురా.. మెలకువగానే ఉంది.  నేను వాతపెట్టబోతుంటే పగబట్టిన నాగుపాములా బుస్సుమని పెద్ద పెద్ద కెర్టాలతో నన్ను కాటేసింది” అంటూ వణికిపోతూ … భోరుమని ఏడిచేశాడు.

అదే సమయంలో అటునునుంచొక యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ దాటడం చూసిన శిష్యుల ఆశ్చర్యానికి అంతులేదు.  ఈ యువకుడు ఎంత ధైర్యంగా వస్తున్నాడో ! ఏరు నిద్దరోతుందేమో.. అందుకే వాడినేమి అనలేదు అనుకుని.. “ఇది మంచి సమయం. ఏరు నిద్రపోతుందో లేదో చూసిరా.. మనం కూడా దాటేద్దాం” అన్నాడు మరో శిష్యుడు.

సరేనని ఓ శిష్యుడు నుదుటన వీభూది పెట్టుకుని.. ఆంజనేయ  దండకం చదువుతూ  ఏటి ఒడ్డుకు బయలుదేరాడు.  ఏరులోకి వెల్ళి మెల్లగా శబ్ధం చేయకుండా తన చేతిలోని కాగడాను ముంచాడు.  కాగడాకి నిప్పులేదు కనుక నీళ్ళు ఏ శబ్ధం చేయలేదు.

ఏటినుండి ఏ శబ్ధం రాకపోయేసరికి ఆ శిష్యుడు పరుగెత్తిపోయి తన వారి దగ్గరకొచ్చి – “ఏరు నిద్దరోతోంది. ఇదే మంచి సమయం. అందరూ తయ్యారవ్వండి” అని హడావిడి చేశాడు.

శిష్యులు – గురుగారినెంత లేపిన ఆయనకు మెలకువ రాలేదు. ఆయనను మోసుకుపోదామనుకున్నారు.  అందరూ దేవుణ్ణి ప్రార్థించుకుని, మూటల్ని గురువుగారిని ఎత్తుకుని మొత్తానికి అవతలి ఒడ్డుకు చేరారు.

అయినా గురువుగారికి మెలకువ రాలేదు.  ఏరు దాటిన ఆనందంతో శిష్యులంతా గంతులేశారు. ఇంతలో వాళ్ళలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు.  అందరూ గోల ఏయకుండా నిశ్శబ్ధంగా వరుసలో నిలబడ్డారు.

“ఎందుకు?” అని అడిగాడు ఓ శిష్యుడు.

“మనమంతా ఇవతలి ఒడ్డుకు వచ్చామో లేదో” అని అన్నాడా శిష్యుడు.

“ఐతే ఇప్పుడేం చెయ్యాలి? అనం పన్నెండు మందిమి. గురువుగారు కాక శిష్యులం పన్నెండుమందిమి.”

ఆ శిష్యుడు ఒక్కొక్కరిని లెక్కపెట్టడం మొదలుపెట్టాడు.  అతన్ని వదిలి మిగిలిన పదకొండుమందిని లెక్కపెట్టాడు ఆ వెర్రి శిష్యుడు.

“బాబోయ్ .. మనలో ఒకర్ని ఏరు మింగేసింది” అని గట్టిగా అరిచాడతను.

“అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో” అన్నాడు ఓ శిష్యుడు.

లేదు నేను వెనక్కి తిరిగి చూశాను కదా” చెప్పాడు శిష్యుడు.

“అంటే నిజంగానే ఏరు మింగేసిందన్నమాట” అంటూ శిష్యులంతా భోరున ఏడుస్తూ ఏరుని శాపనార్థాలు పెట్టసాగారు.

అంతలో అటుగా భుజాన కర్రపట్టంకుని ఓ బాటసారి వస్తున్నాడు. శిష్యులను చూసిన ఆ రైతు వారిని సమీపించి, “మీరెవరు?  ఎందుకు బాధపడ్తున్నారు” అని ప్రశ్నిచాడు.

“మా గురువుగారు పరమానందయ్యగారు, మేము ఆయన పన్నెండుమంది శిష్యులం.  మేమంతా కలసి ఏరుదాటుకొస్తుంటే అది మాలో ఒకర్ని మింగేసింది.” అని చెప్పారు శిష్యులు.

“బాటసారి వారిని ఒకసారి లెక్కపెట్టి చూశాడు. శిష్యుల తెలివి తక్కువతనం అతనిని అర్థమయ్యింది.  అందుకే వారిని ఆటపటించాలనుకున్నాడు “నేనెవరిని” అని అడిగాడు బాటసరి శిష్యులని.

“తెలియదు” అన్నారు శిష్యులు

“ఇంతకీ మీరెవరు?” అన్నాడు ఓ శిష్యుడు.

“నేనెవరో ఓరికే చెప్పేస్తానా? మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెబుతాను” అన్నాడు బాటసారి చాలా తెలివిగా.

మనం అన్ని విషయాలు తెలుసుకొవాలని గురువుగారు చెప్పారు కదా? అందుకని ఇతనెవరో తెలుసుకుందాం అనుకున్నారంతా. బాటసారికి ఓ మూట ఇచ్చి “చెప్పు నువ్వెవరు?” అని అడిగారు.

“నేను మారువేషంలో ఉన్న మాంత్రికుడిని. భూత పిశాచాలను పారద్రోలుతాను”.  అన్నాడు

“నువ్వు ఏరు మింగేసిన మా వాడిని తీసుకురాగలవా?” అన్నాడు ఓ శిష్యుడు.

“తీసుకువస్తాను కాని కొంచం ఖర్చవుతుంది” అన్నాడు బాటసారి.

“మనిషికంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు ఇదిగో మరో మూట” అని డబ్బు ఇచ్చారు.

అప్పుడు ఆ బాటసారి ఏదో ఓ పిచ్చిమంత్రం చదువుతున్నట్లు నటించాడు.  అతను శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి, ఒక్కొక్కరిని ఒక్కో అంకే లెక్కపెట్టమని చెప్పాడు. అలా లెక్కపెట్టగా పన్నెండుమంది శిష్యులు లెక్క వచ్చారు.

అప్పుడు బాటసారి, “చూశావా మీ వాడిని తెప్పించేశాను” అన్నాడు శిష్యుల ఆనందానికి, ఆశ్చర్యానికి  అవధులు లేవు.

“మీరు సామాన్యమానవులు కారు. ఏరు మింగేస్న మావడిని తెప్పించగలిగారు.   మీకేమిచ్చి రుణం తీర్చుకోగలమని?.. అయినా మీ ప్రతిభకేదో మా వద్ద ఉన్నంత సమర్పించుకొంటాం అంటు మిగతా డబ్బు మూటలు కూడా బాటసారికి ఇచ్చేశారు. అవి తీసుకుని సంతోషంతో అక్కడనుండి వెళ్ళిపోయాను బాటసారి.

అప్పుడు మెలకువ వచ్చింది గురువుగారికి. డబ్బు గురించి అడగ్గా శిష్యులు జరిగిందంతా విపులంగా చెప్పారు.  వాళ్ళ తెలివితక్కువతనానికి నెత్తినోరు బాదుకొన్నారు గురువుగారు

****

– మౌనిచింటు

పన్నెండు మంది శిష్యుల కథ

By: - Category: పరమానందయ్య శిష్యుల కథలు

గురువుగారు  – పరమానందయ్యగరు. వారి శిష్యులు మొత్తం పన్నెండు మంది.. తెలివితక్కువతనానికి, మూర్ఖత్వానికి పెటింది పేరు. పేరు పరమానందయ్యగారి శిష్యులు. ఆ పన్నెండు మంది శిష్యులు చేసే తెలివితక్కువ పనులు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి.. అసలు పరమానందయ్య గారి శిష్యుల గురించి  కొంచం వివరంగా తెలుసుకుందాం.
****

పూర్వం దేవలోకంలో పన్నెండుమంది మునీశ్వర్లు ఒక ఉద్యానవనంలోంచి వెళ్తున్నారు. ఆ వనం ఎంతో అందంగా ఉంది. మునులు ఉద్యానవనం అందచందాలను అస్వాదిస్తూ మెల్లగా మట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు.

వీరు వెళ్తున్న బాటనానుకొని దట్టమైన పూపొదలు ఉన్నాయి. వాటి వెంకాలే స్వచ్ఛంగా మెరుస్తున్న నీటిలో రంగురంగుల పద్మాలు కలిగిన కొలను ఉంది. ఆ సమయంలో ఆ కొలనులో ఒక అప్సరస జలకాలాడుతోంది. అప్పుడు ఆమెకు ఈ మునుల మాటలు వినిపించి వారు తన సౌందర్యాన్ని రహస్యంగా చూస్తున్నారన్న అనుమానంతో —- ” మీరంతా వట్టి బుద్ధి హీనులు కండి” – అని శాపం ఇచ్చింది.

వారి వెనుకగా  వస్తున్న తాపసి ఇది గమనించాడు మునులు – “మాకే పాపమూ తెలిదు మేము నీ సౌందర్యాన్ని  చూడడంలేదని అని మొరపెట్టుకొన్నారు. తాపసికి అప్సరస తొందరపాటు కోపం వచ్చి – “నువ్వు ముందూ వెనుకా చూడకుండా తొందరపాటుతో మునులని శపించావు. కనుక – నువ్వూ వారితో పాటు భూలోకమొలో జన్మించు” అని ఆమెను శపించాడు.

భూలోకంలో శివభక్తుడైన మహరాజు ఉంటాడు. ఈ అప్సర అతనికి వేశ్యగా ఉంటుంది. ఆ రాజుకు అభిమానుడయిన ఓ పండితుడు మఠం కట్టుకొని నివసిస్తూ ఉంటాడు. అతను మహా పండితుడు. ఆయన వద్ద ఈ పన్నెండు మంది మునులు తెలివితక్కువ శిష్యులుగా చేరుతారు. రాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం చేస్తుంటాడు.

ఆ మహాపండితుడే ప్రమానందయ్యగారు. వారికి శిష్యులంటే వల్లమాలిన ప్రేమ, ఎక్కడలేని వాత్సల్యమూ, శిష్యులెంత తెలివితక్కువగా ప్రవర్తించినా, థం తెలివితక్కువతనం వల్ల గురువుగారికి ఎన్ని విధాల బాధలు కలిగించినా ఆ గురువుగారికి శిష్యుల మీద ఎంతమాత్రమూ కోపం వచ్చేది కాదు.

పరమానందయ్య గారు గొప్ప పండితులు. పురాణాలు, హరి కథలు చెప్పడంలో దిట్ట. ఆయనకు రాజాశ్రమముంది. పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.
*******
ఇది పరమానందయ్య శిష్యుల పరిచయం. తరువాత తరువాత ఒక్కో కథ చొప్పున మీకు జాబిల్లి ద్వార చెప్పి మీ చిరు చిరు నవ్వుల నక్షత్రాలని మేము మా జబిల్లిలో  దాచేసుకొంటాము.

- మీ మౌనిచింటు

ఒక సరదా ఆట NPAT

By: admin Category: ఆటలు

NPAT –  Name- Place- Animal-Thing

——-        To       ——- 

మొదట  అందరూ  తలా ఒక కాగితంపై Name | Place|   Animal|  Thing|   Points   అని ఐదు కాలమ్స్ గా  రాసుకోవాలి.

ఇప్పుడు  ఒకరు  start అని చెప్పగానే   మొదటి  వారు  abcd…లు  చదవాలి.

అప్పుడు  తిరిగి  stop అనగానే  ఏ లెటర్ వద్ద  ఆపుతారో  ఆ  లెటర్  తో  మొదలయ్యేవిధంగా  అందరూ  తమ చార్ట్  లలో   Name  కింద వ్యక్తి పేరు,

Place  కింద  ఊరిపేరు/స్థలం పేరు ,

Animal  కింద జంతువుపేరు,

Thing  క్రింద  ఏదైనా వస్తువు పేరు  రాయాలి.   (ఒక్కోదానికి  పది   Points చొప్పున  వస్తాయి)

ఉదా ;  abcd.. చదువుతూ  R  వద్ద ఆపితే  అందరూ  R తో మొదలయ్యే  పేరు, స్థలం , జంతువు,  వస్తువు  రాయాలి.

ఉదా;   Name | Place|   Animal|  Thing| Points

—-Ravi  |  R ajasthan  |  Rabbit  |  Rocket |

మొదటి గా   రాసిన వాళ్ళు  పది అంకెలు  లెఖ్ఖ పెట్టే లోగా  మిగతావారు  రాయడం పూర్తి చేసి ఆపేయాలి, అంతలోగా  రాయలేకపోతే   రాయని వాటికి  Points   రావు.

ఇప్పుడు   ఎవరెవరు  ఏం  రాశారో  చెప్పాలి.  ఒకే  విధమైన  పేర్లు  రాస్తే  అవి కొట్టి వేయాలి  అంటే  వాటికి  Points   ఉండవు.

ఉదా;   1, 2, 3, 4 అనే వాళ్ళు  ఈ ఆట  ఆడుతున్నారు.  1 రాసిన వ్యక్తి పేరు 3 కూడా రాశాడు.  అలాగే  3 రాసిన  జంతువు పేరు  2 కూడా రాసాడు  అనుకుందాం.

ఇప్పుడు  1 కి 3 కి కూడా  పేరు కి Points  రావు.  అలాగే  3 కి 2 కి జంతువు కింద రావాల్సిన  Points రావు.  అంటే  ఇక్కడ  ఎవరూ  రాయని పేర్లు రాసిన వాళ్ళకి  ఎక్కువ Points  వస్తాయన్నమాట.  అలాగే  త్వరగా కూడా  రాసేయాలి.

అందరూ  తమకి వచ్చిన  points   points column లో  వేసుకోవాలి.

మళ్ళీ ఇంకొకరు  abcd… చదువుతారు    ఆపిన  లెటర్  తో  తిరిగి  అంతా  పేరు,  స్థలం,  జంతువు, వస్తువు  రాయాలి.

ఈసారి  తరువాతి వాళ్ళు  చదువుతూ  స్టాప్ అనగానే  K వద్ద ఆపితే..

ఉదా;

Name | Place|   Animal|  Thing| Points

Ravi  |  R ajasthan  |  Rabbit  |  Rocket |40

kiran | kerala | kangaroo  | kite  |  40

*ఎవరూ రాయనివి తాము  రాస్తే  వాటికి  points.    ఒక్కోదానికి  పది  చొప్పున  వేసుకోవాలి.

ఇలా  abcd లు అన్ని  పూర్తయ్యే  వరకు  ఆడవచ్చు.  లేదా  కొంతసేపు  ఆడుకోవచ్చు.

చివరగా  అందరి  మార్కులు  టోటల్  చేస్తే   ఎవరికి  ఎక్కువ  మార్కులు  వచ్చాయో  వాళ్ళు  ఆ ఆటకి  విజేత.

చిటికెల పందిరి

By: admin Category: పాటలు

697931_starfeild

రచన ; కుసుమ కుమారి

చిటి చిటి జాబిలి చిటికెలు వేసెను
చుక్కలు వచ్చి,నింగిని చేరెను
నీలాంబరము తారల కొలువయె!

జాబిలి వెన్నెల చప్పట్లు చరిచెను
నక్షత్రాలు కొలువు దీరి – మరీ
మిణుగురు కాంతుల చిటికెలు వేసెను

వెన్నెల తీరులు శత కోటి
రాతిరి కాంతుల చలువ పందిరి
పిన్నలు,పెద్దల ఆటల సందడి, ఉరవడి

కళ్యాణ్‍ రాఘవ

By: admin Category: కథలు, బాలలు వ్రాసిన కధలు

రచన ; కళ్యాణ్

కళ్యాణ్ అంటే స్కూలు లో లీడర్. అందరికంటే ఎక్కువ బలం. అందరికంటే ఎక్కువ తెలివి.  అందరు ఎక్కువ పొగిడేస్తూ ఉండెసరికి  కళ్యాన్ కి గర్వంగా ఉంటుంది. కళ్యాణ్  మంచి పిల్లాడే  కాని  గర్వంతో పొగరుమోతుగా తయారయ్యాడు.

ఆ సంవత్సరం  వాళ్ళ క్లాసుకి  ఓ కొత్త  స్టూడెంట్  వచ్చాడు.  అతడిపేరు రాఘవ.   రాఘవకి  చిన్నప్పుడు  ఒక  ప్రమాదంలో  ఒక కాలు విరిగిపోయింది. స్కూలులో  పిల్లలందరూ  రాఘవని  చూసి  నవ్వుతున్నారు.  కర్రలతో మెల్లిగా  నడుస్తాడు  రాఘవ.  అందరితో కలిసి  పరిగెత్తలేడు,  ఆడుకోలేడు.   అందరూ  ఆటల పీరియkalyan raghavaడ్‍లొ  గ్రౌండ్‍లో ఆడుతూ  వుంటే  రాఘవ  ఒక్కడు   తరగతి  గదిలోనే  వుంటాడు.

కళ్యాణ్‍కి రాఘవని  చూస్తే చులకన. తన బలం ముందు  రాఘవ ఎందుకుపనికిరాడని  కళ్యాణ్‍కి  తెలుసు.  రాఘవ  కర్రలతో  నడుస్తుంటే  కళ్యాణ్ వెక్కిరిస్తూ ఉంటాడు. కళ్యాన్‍ రాఘవని  వెక్కిరించగానే  పిల్లలందరూ  నవ్వుతారు,  అది  కళ్యాణ్‍కి మజానిస్తుంది.
రాను రాను  చులకన  కోపంగా , అసహ్యంగా మారింది.  ఇప్పుడు  కళ్యాణ్‍కి  రాఘవ అంటే కోపం,  అసహ్యం.  నేను లీడర్ గా వున్న  క్లాసులో ఈ కుంటాడు  లేకుంటే  బావుంటుంది  అనుకుంటాడు  కళ్యాణ్. ఎంత  వెక్కిరించినా ఏడవని  రాఘవని  చూస్తే  కోపం ఇంకా పెరిగి పోతుంది.

ఓ సారి  వాలీ బాల్‍ ఆడుతూ  వుంటే  అనుకోకుండా కిందపడిపోతాడు  కళ్యాణ్‍.   కాలికి దెబ్బ  తగిలి  నడవలేక పోయాడు.  ఇంకా కొద్దిరోజుల్లో మ్యాచ్ వుంది,   ఎలా?  ఎంతో ఏడుస్తాడు  కళ్యాణ్.

దెబ్బకొద్దిగా  మానినాక  ఓ కర్ర సాయంతో మెల్లిగా  స్కూలుకి  వస్తాడు.  అందరూ సంతోషంగా పరిగెత్తుతూ  వున్నారు  నెనొక్కడినే  ఇలా వున్నా  అనుకుంటాడు  విచారంగా.

ఆటల  పీరియడ్‍లో  పిల్లలందరూ  గ్రౌండ్‍కి వెళ్ళిపోయారు  కళ్యాణ్‍కి  దిగులుగా వుంది,  నాకోసం ఒక్క స్నేహితుడూ  వుండకుండా  అందరూ  ఆటకి పోయారు  అనుకున్నాడు.  క్లాసులో  రాఘవ  వున్నాడు,  కాని  కళ్యాణ్‍కి  అతడితో  మాట్లాడాలనిపించలేదు.

ఇంకోరోజు  రాఘవ పిలచినా  మాట్లాడడు  కళ్యాణ్.
రెండు మూడు రోజులు అయ్యాక  కాలులేకపోతే  ఎంత  కష్టం అనేది అర్ధం అయింది  కళ్యాణ్‍కి.  నాకు కొద్దిరోజులకే  ఎంత కష్టంగా  వుంది,  పాపం  రాఘవ  ఎప్పుడూ  కాలు లేకుండా వుండాలి  ఎంత కష్టం  అనుకుంటాడు.

ఈ సారి  క్లాసులో  ఆటల పీరియడ్ లో  రాఘవ  మాట్లాడితే  కళ్యాణ్‍కూడా  మాట్లాడుతాడు.  రాఘవ  కళ్యాణ్‍కి  స్నేహం కుదురుతుంది,  రాఘవ ఎన్నో  కథలు  చెపుతాడు,  బొమ్మలు గీయడం  నేర్పుతాడు.  పాటలు  నేర్పుతాడు.  రాఘవకి ఎన్ని  తెలుసు  అనుకుని  ఆశ్చర్య పోతాడు  కళ్యాణ్‍.  మ్యాచ్  ఆడలేకపోయినందుకు  పడే  విచారం  తొలగిపోతుంది.

కొద్ది రోజుల తరువాత  కళ్యాణ్‍  కాలు  గాయం  పూర్తిగా 

ఓ మంచిమాట

By: admin Category: ఒకమంచిమాట

చిన్న విత్తనం  మొలకెత్తి  పెద్ద  చెట్టుగా  మారేలోగా  ఎన్ని  అడ్డంకులు  అవాంతరాలు,  మొదట  విత్తనం  మట్టిలో  ఉండగానే  చీమలూ,  పురుగులూ  తినేసేయాలని  చూస్తాయి.

అది వాటిని తప్పించుకుని  మొలకెత్తుతూ   ఉంటే  పక్షులు  దాన్ని  పసిగట్టి  పొడుస్తూ  తినేయాలని  చూస్తాయి.

ఆ తరువాత  అది  పెరుగుతూ  ఉంటే  పశువులూ  దాని పని పట్టబోతాయి.

ఐనా  అది  ఎదిగి పెద్ద వృక్షంగా  మారిందంటే,  ఇంతకాలం  దాని ఎదుగుదలకు  అడ్డంకిగా ఉన్న  ఆ జీవులన్నీ  దాని  నీడలోనే  తలదాల్చుకుంటాయి.

మనిషి  ఎదుగుదలా  సరిగ్గా ఇలాంటిదే.

జారు! జారు!జల పాతాలు !

By: admin Category: పాటలు

Salto Del Angel

రచన;కాదంబరి

జారు! జారు!జల పాతాలు !
ఎత్తిపోతల జల పాతాలు :
వంశ ధార నది,పంచ ధారల,
కుంతల వాటర్ ఫాల్సు,ఓహో!

జారే జారే జల పాతాలలొ
సిరి వెన్నియల*1జల తారు పోగులు!

తూర్పు కొండల దిన మణి పింఛము!
జల ధారలలో హరివిల్లు లొహో!

జల పాతాలలొ సంతోషాల స్నానాలు!
ధార ధారనూ అల్లు కున్నవీ
పిన్నల,పెద్దల కోలాహలాలు,
“నవ్వు,కేరింతల”ఒప్పుల కుప్పలు

*************************************************

(*1సిరి వెన్నియలు=సిరి వెన్నెలలు)