ముత్యాల ముగ్గు

March 29, 2010 in Uncategorized by Pradeep

ఒకసారి మా వీధిలో జరిగిన సంఘటన మూలం ఈ కవితకి..

అప్పుడే తొలిప్రేమ సినిమా రిలీజ్ అయింది ఆ ఎఫ్ఫెక్ట్/ ఆ సీన్, నేను నా రియల్ లైఫ్ లో చూస్తానని అనుకోలేదు..

ఒకటే తేడ, అక్కడ పిల్లలతో ఆడుకుంటుంది ..  ఈక్కడ ముగ్గు పెడుతుంది.. అంతే

ఆమె ఇంటి ముందర ఎప్పుడు వెలగని వీధి దీపం.. ఆ రోజే వెలగడం..

నాకు చిన్న పని కూడా చేయని ఆమె ముగ్గు వేయడం .. ఇంకా గుర్తు

ఆ చిన్న గ్యాపకమే ఈ ముత్యల ముగ్గు…

ముత్యాల ముగ్గు

ఒక తారక నింగిని వదిలి

భువి నందు  ముత్యాల ముగ్గు వేయ

నా కన్నులలో నిండెనే ఆమె రూపం

ఆ ముత్యాల ముగ్గు ఆ తారక వేయచుండగా

చూడగా నా కన్నులు చాలక పోతివే….

ఆమె కురులు రాతిరి వర్ణముతో కలువగా

ఆ కురులలో తారలను తెంచి మాలగా

కూర్చినట్టి  ఆ మల్లెలు, ఆ మల్లెల సువాసనలు

నన్ను మైమరపించగా మరచితినే నన్ను నేను

పున్నమి సందురుడి వలె వికసించిన

ఆమె ముఖారవిందం, అవి

కలువలా లేక కన్నులా…

నుని సిగ్గుతో ఎరుప్పెక్కిన చెక్కిలు

ఆమె అధరపు వర్ణమును గులాబీలు

ఎరవుగా తెచుకొన్నున్నమో….

ముగ్గు వేయుచుండగా అలసిన చిహ్నం

ఆమె మోముఫై వెలసిన చిరుస్వేదములు

చిరుగాలితో ముచ్చట్లు చెప్పుతున ఆమె

కురులను మందలించి సరిచేసుకోగా,

ముత్యల హరివిల్లు ముగిసినదేమో … విరిసేను

ముఖము సూర్యకోటి ప్రజ్వలలుగా….

ముని వేళ్ళఫై  లేచు చుండగా

బరువువెక్కిన ఆ పాదములు అదుపు తప్పగా

వ్రాలెను నా ఒడిలో .. ఒ కూనలా..

నా కన్నులు తెలిపెను ఆమెకు నేచెంత నున్నానని

వుంటానని … ఎప్పుడు … ఎల్లప్పుడూ

ఆమె నుని సిగ్గు కాస్త మారెను…

పెండ్లి కూతురి సిగ్గుగా…