March 2, 2010 in కధ by teluguratna
రచన : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
కొడిగట్టిపోతున్న కర్షకుల జీవితాల్లా ఆకాశంలోని నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ ఉసూరుమంటున్నాయి.శిథిలమైపోయిన ఊరిబావిలా సగం చిక్కిన చంద్రుడు నిర్వికారంగా
చూస్తున్నాడు.కీచురాళ్ళ సొద,అప్పుడప్పుడు ఎక్కడినుంచో దూరంగా వినిపించే కుక్క అరుపు తప్ప అంతా స్తబ్ధుగా ఉంది.
ఊరి పొలిమేరలో !
తన చేను మధ్యలో !
అస్త్రసన్యాసం చేసి అంపశయ్య చేరిన భీష్మపితామహుడిలా నిస్సహాయంగా జారగిలబడి ఉన్నాడు అనంతరామయ్య.చుట్టూ వున్న కటిక చీకటిలాగే అతని గుండెల్లో గుబులు దట్టంగా పరచుకొని
ఉంది.నిరాశా నిస్పృహలు దావానలంలా అతని నరనరాన్ని దహించి వేస్తున్నాయి.గురవయ్య విధించిన గడువు నేటితో తీరిపోయింది.జోళ్ళు అరిగేలా ఊళ్ళు తిరిగినా ఎక్కడా అప్పు పుట్టలేదు.ఇక పుట్టదనీ అర్థమైపోయింది.ఆఖరు బస్సుదిగి,ఇంటికి వెళ్ళడానికి మనసొప్పక ఇటువైపు వచ్చాడు.అప్పటికే అతనొక నిర్ణయానికి వచ్చేశాడు. Read the rest of this entry →
February 28, 2010 in కధ by teluguratna
రచన : రమ్యగీతిక
“పరిమళ గుర్తుందారా నీకు?” తీరిగ్గా కుర్చీలో కూర్చుంటూ అంది అమ్మ.
“పరిమాళా ఆంటీనా?” టక్కున అడిగాను ఆసక్తితో.
నా వైపు అదోలా చూసింది “బాగానే గుర్తుంచు కున్నావే్! నీ ఫేవరేట్ ఆంటీ కదూ!”
ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఒకే ఒక్కరు. పరిమళా ఆంటీ పేరు తలచుకోగానే గుర్తొచ్చేది ప్రసన్నంగా ఉండే ఆమె నవ్వు మొహం. ఎప్పుడు కరుణ కురిపించే ఆ చల్లని చూపులు. ఆమె దగ్గర ఏదో డివైన్ నెస్! దేవుడు ప్రత్యక్షమై ఏంకావాలని అడిగితే ‘పరిమళా ఆంటీ లాంటి అమ్మ కావాలి జన్మజన్మలకు’ అని అడగాలనిపించేంత అమ్మతనం ఆంటిలో.
కుటుంబానికి అర్ధం అనేది ఆంటీ వాళ్ళను చూసే నేర్చుకున్నాను. ఆదరణ, ఆప్యాయతా ఎదుటి మనిషికి ఎంత శక్తిని ఇస్తుందో స్వయంగా అనుభవించాను.
చేతిలోని టీవీ రిమోట్ పక్కన పడేస్తూ అమ్మ వైపు తిరిగాను ఆసక్తిగా.
“మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు కనిపించింది, ఇప్పుడు ఇక్కడే వుంటున్నారట. ఆమె భర్త పోయాడుట!”
Read the rest of this entry →
February 26, 2010 in స్వగతాలు by teluguratna
రచన : మీనాక్షి రెడ్డి
పాత అప్పుడప్పుడు కొత్త కంటే అద్భుతంగా ఉంటుంది..గతాన్ని తలుచుకోవడం ,తడుముకోవడం
ఒక అపూర్వానుభూతిని మిగులుస్తుంది……
మధురమైన చినుకుల్లో తడిచి,పులకించడం ఒక కమ్మని అనుభూతి కదా………
…………………………………….
నేను చిన్నగా ఉన్నప్పుడు,స్కూల్ కి సెలవులు వస్తే ఎక్కువగా మా ఊరికి వెళ్ళేవాళ్ళం…
అసలు ఆ ఊరు ,ఆ వాతావరణమే వేరు…….
Read the rest of this entry →
February 26, 2010 in తెలుగురత్న by Shiva Bandaru
తెలుగురత్న కొత్త అవతారానికి స్వాగతం . తెలుగురత్న ఆల్పా టెస్టింగ్ లో పాలుపంచుకుని మీ విలువైన సలహాలు ఇవ్వగలరు.
పాత తెలుగురత్న ను కూడా త్వరలోనే ఆన్లైన్ లో తీసుకువస్తాము .
అది ఇక్కడ లభ్యమతుంది (ఇంకా అప్‌లోడ్ చెయ్యలేదు)
http::/old.teluguratna.com
పత్రిక వాఖ్యలు